వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య మ్యాచ్ నిన్న లక్నోలో జరిగింది. అయితే మ్యాచ్ మధ్యలో భారీ వర్షం రావడంతో గాలిదుమారానికి స్టేడియంలోని ఓ భారీ బోర్డు ఊడి ప్రేక్షకులు కూర్చునే సీట్ల మధ్య పడింది. అయితే అది ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ ఉండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అక్కడ ప్రేక్షకులు తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం కారణంగా కొంతసేపు ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత వర్షం ముగిసాక తిరిగి ఆట ప్రారంభమైంది. మళ్లీ శ్రీలంక ఇన్నింగ్స్ అయిపోయాక కూడా కొద్దిసేపు వర్షం కురిసింది. ఎట్టకేలకు వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది.