మొన్న రాత్రి ముగిసిన ఆఫ్గనిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో మాక్స్ వెల్ ఇన్నింగ్స్ ను క్రికెట్ ప్రేమికులు ఎవ్వరూ అంత త్వరగా మరిచిపోలేరు. ఒక సూపర్ మాన్ లాగా ఆస్ట్రేలియా ను ఆదుకుని ఒంటి చేత్తో సెమీఫైనల్ కు చేర్చాడు. ఆస్ట్రేలియా దేశ పరువును తన రెండు కాళ్లతో ఎంతో శ్రమను, కష్టాన్ని, బాధను దాచుకుని విజయతీరాలకు చేర్చి భళా మాక్స్ వెల్ అనిపించుకున్నాడు. ప్రపంచమంతా ఇతన్ని ఎంతగానో పొగుడుతోంది..
తాజాగా క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన స్పందనను తెలియచేశాడు. సచిన్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తూ, “జీవితానికి మరియు క్రికెట్ కు చాలా పోలికలు ఉన్నాయి. కొన్ని సార్లు ఏదైతే మనల్ని వెనక్కి లాగుతుందో, అదే ముందుకు తీసుకువెళుతుంది. వివిధ ఫార్మాట్ లలో వేరు వేరు ఫుట్ వర్క్ లు అవసరం, ఇంకా కష్టసమయంలో అసలు ఫుట్ వర్క్ లేకుండా ఆడడం కూడా మంచిదే. ఒకవైపు గాయం ఎంత బాధించినా ఎక్కడా తలొగ్గకుండా మ్యాక్సీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ను ఆడాడు అని ఆకాశానికి ఎత్తేశాడు.