Election Updates: పవన్ కల్యాణ్‌ మద్దతు కోరిన లండన్ మేయర్‌ అభ్యర్థి

Election Updates: Pawan Kalyan is the London Mayoral candidate who sought support
Election Updates: Pawan Kalyan is the London Mayoral candidate who sought support

పవర్ స్టార్ పవన్ కల్యాణ్​కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే కేవలం సినిమాల్లోనే కాదు రియల్​ లైఫ్​లోనూ పవన్​కు అభిమానులున్నారు. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫ్యాన్​డమ్ మరింత పెరిగింది. పవన్ కల్యాణ్​కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులు ఉంటారని అంటారు. కొన్నికొన్ని సంఘటనలు చూస్తే అది నిజమేనేమో అనిపించక మానదు. పవన్​కు ఉన్న క్రేజ్​ను క్యాష్ చేసుకోవడానికి కొంత మంది రాజకీయ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు.

అలా రాజకీయాల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఓ ఎన్​ఆర్​ఐ నేత ఏకంగా పవన్​ కల్యాణ్​ను కోరారు. లండన్‌ మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన తరుణ్‌ గులాటీ పవన్​ మద్దతు కోరారు. హైదరాబాద్‌లో బుధవారం రోజున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలిసి మద్దతు కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, జనసైనికులు ఎక్కువగా ఉన్నారని గులాటీ చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ అభ్యర్థనను పవన్‌కల్యాణ్‌ స్వాగతించినట్లు చెప్పారు. తన అభిమానులు, జనసేన శ్రేణులు, తెలుగువారు, భారతీయులు తరుణ్‌ గులాటీ విజయానికి కృషి చేయాలని పవన్‌ కల్యాణ్‌ కోరినట్లు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.