Breaking : పెళ్లి చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్

Breaking: TTD is good news for those getting married
Breaking: TTD is good news for those getting married

పెళ్లి చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నూతన వధూవరులకు తిరుమల శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, ప్రసాదాలు, పసుపు, కుంకుమ, కళ్యాణ సాంస్కృతి పుస్తకాన్ని అందించే కార్యక్రమాన్ని టిటిడి పునః ప్రారంభించింది. ఇవి పొందాలంటే మీ పూర్తి అడ్రస్ తో శ్రీ వెంకటేశ్వర స్వామి, EO ఆఫీస్, TTD అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీరోడ్, తిరుపతి-517501 అనే చిరునామాకు శుభలేఖ పంపాలి.

పెళ్లి ముహూర్తానికి నెల ముందు పంపితే మీకు పోస్టులో వాటిని పంపుతారు. టీటీడీ ఇలా కొత్తగా పెళ్లి చేసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిందన్న మాట. ఇక అటు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి దర్శనం టికెట్లు, గదులకోటాను టీటీడీ రేపు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు 2.25 లక్షల ఎస్ఈడి టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదులకోటను సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు.