వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య 41వ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే నేరుగా సెమీఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండియా మరియు దక్షిణాఫ్రికా జట్టు సెమి ఫైనల్లోకి చేరాయి. ఇప్పుడు నాలుగు స్థానం కోసం జట్లు పోరాడుతున్నాయి. ఇవాళ మ్యాచ్ గెలిస్తే న్యూజిలాండ్ ఖచ్చితంగా సెమీఫైనల్ లోకి చేరుతుంది. అటు ఇప్పటికే శ్రీలంక జట్టు వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కానీ ఇవాళ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక ఆలోచన చేస్తోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.