ముంబై లో ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చాలా ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. మొదటగా ఆఫ్ఘన్ విసిరిన 292 పరుగుల లక్ష్యాన్ని కంగారూల ముందు పెట్టింది. ఇక ఆస్ట్రేలియా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించలేదు. ఎంతలా అంటే.. ఆస్ట్రేలియా కేవలం 100 పరుగుల లోపే 7 వికెట్లు కోల్పోయింది. దీనితో ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఏంటీ మరో సంచలనం జరుగుతుందా అనుకున్నారు..కానీ మాక్స్ వెల్ ఆఫ్ఘన్ విజయానికి ముందర అడ్డంగా నిలబడిపోయాడు.
కెప్టెన్ కమిన్స్ తో కలిసి మాక్స్ వెల్ ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. ఈ దశలో మాక్స్ వెల్ ఈ వరల్డ్ కప్ లో మరో సెంచరీ ని నమోదు చేసుకున్నాడు. మాక్స్ వెల్ ఈ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు మరియు 3 సిక్సు లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇక ఆఫ్ఘన్ కనుక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలి అనుకుంటే మాక్స్ వెల్ ను అవుట్ చేయాల్సి ఉంది. లేదంటే ఓడిపోయి వరల్డ్ కప్ నుంఢి ఆఫ్గనిస్తాన్ నిష్క్రమిస్తుంది.