World Cup 2023 : నేడు ఇంగ్లాండ్ vs నెదర్లాండ్ మధ్య మరో ఆసక్తికర పోరు

World Cup 2023: Another interesting match between England vs Netherlands today
World Cup 2023: Another interesting match between England vs Netherlands today

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటిలాగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది.

అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కంటే నెదర్లాండ్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఇంగ్లాండ్ చెత్త ప్రదర్శన మాత్రమే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచ్లలో ఆరు మ్యాచ్లు ఓడిపోయింది ఇంగ్లాండ్. ఈ తరుణంలోనే పాయింట్స్ టేబుల్ లో చిట్టచివరంగా ఉంది. అంతేకాకుండా ఈ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే వైదొలిగింది ఇంగ్లాండ్ జట్టు. ఈ నేపథ్యంలో.. ఇవాళ నెదర్లాండ్ జట్టుతో తలపడనుంది ఇంగ్లాండ్. మరి ఈ మ్యాచ్ లో నైనా గెలిచి పరువు నిలబెట్టుకుంటుందా ? లేదా చెత్తగా ఆడుతుందో చూడాలి.