వరల్డ్ కప్ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా ఆస్ట్రేలియా ఈ రోజు ఢిల్లీ లో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్ ను చిత్తు గా ఓడించి సెమీస్ వైపు మరో అడుగు ముందుకేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నెదర్లాండ్ ముందు 400 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ స్కోర్ ను చూడగానే అభిమానులు అంతా ఈ మ్యాచ్ చూడడం వేస్ట్ అని ఫిక్స్ అయి ఉంటారు. అందుకు తగినట్లే నెదర్లాండ్ వరల్డ్ కప్ లో మరోసారి బ్యాటింగ్ లో దారుణంగా విఫలం అయ్యి కేవలం 90 పరుగులకె ఆల్ అవుట్ అయ్యి… వరల్డ్ కప్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని (309) ఆస్ట్రేలియాకు అప్పగించింది. బ్యాట్ తో వార్నర్ , మాక్స్ వెల్, స్మిత్ మరియు లాబుచెన్ లు రాణించగా, బంతితో జంపా (4), మార్ష్ (2 ) లు రాణించారు. ఇక నెదర్లాండ్ బ్యాటింగ్ లో విక్రమ్ జీత్ సింగ్ ఒక్కడే 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ ని నమోదు చేసి మాక్స్ వెల్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఆస్ట్రేలియా ఈ ఘనవిజయంతో అయిదు మ్యాచ్ లలో మూడు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి చేరుకుంది.