World Cup 2023 : భారత్ చేతిలో ఓడిన ఇంగ్లాండు చెత్త రికార్డులు నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్గా ప్రపంచ కప్ లో భాగంగా వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిన రెండో జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియా 1992లో ఇలా ఓడిపోయింది. అలాగే ఇంగ్లాండు వరుసగా మూడు మ్యాచ్ లలో 200 రన్స్ లోపే ఆల్ అవుట్ కావడం ప్రపంచ కప్ చరిత్రలో ఇదే తొలిసారి.
సౌత్ ఆఫ్రికా చేతిలో 170, శ్రీలంక చేతిలో మ్యాచ్ లో 156, నిన్న భారత్ చేతిలో 129 రన్స్ కు ఇంగ్లాండు ఆల్ అవుట్ అయ్యింది. అలాగే ఆరుగురు బౌల్డ్ కావడం 1975 తర్వాత ఇదే తొలిసారి. కాగా, నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయ కేతనం ఎగురవేసింది. ఇంగ్లాండ్ తో ఆదివారం జరిగిన లోస్కోరింగ్ గేమ్ లో టీమిండియా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా సెమిస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది.