ఫ్యాన్స్ కు షాక్…టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. డాక్టర్లు మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని హార్దిక్ కు సూచించినట్లు సమాచారం. దీంతో ఇంగ్లాండు తో మ్యాచ్కు అతడు దూరం కానున్నాడు. కాగా…బంగ్లా తో జరిగిన మ్యాచ్ లో పాండ్యా గాయపడ్డారు.
లిటన్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా తన కాలును దూరంగా జరిపారు. దీంతో అతడి చీలమండ భాగం మడత పడింది. కాగా, వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని ఇండియా వరుస విజయాలతో టైటిల్ లక్ష్యంగా పెట్టుకుని యుద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ఇండియా ఆడిన మ్యాచ్ లలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లను ఓడించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇండియా ఆడనున్న తర్వాత మ్యాచ్ లలో వరుసగా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, మరియు నెదర్లాండ్ లను ఎదురుకోనుంది.