మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ నెక్‌బ్యాండ్ పేరిట నూతన బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. బ్లూటూత్ 5.0 ఆధారంగా ఈ ఇయర్‌ఫోన్స్ పనిచేస్తాయి. 8 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ఇయర్‌ఫోన్స్ ఇస్తాయి. వీటికి బిల్టిన్ మైక్రోఫోన్ ఉన్నందున కాల్స్ చేసుకోవచ్చు. రూ.1599 ధరకు ఈ ఇయర్‌ఫోన్స్ వినియోగదారులకు ఎంఐ ఆన్లైన్ స్టోర్‌లో ఈ నెల 23వ తేదీ నుంచి లభ్యం కానున్నాయి.