మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ సోనిక్చార్జ్ పేరిట 27వాట్ల సామర్థ్యం కలిగిన ఓ నూతన సూపర్‌ఫాస్ట్ చార్జర్‌ను భారత మార్కెట్లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో క్వాల్కామ్ క్విక్‌చార్జ్ 4.0 టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ చార్జర్‌తో ఫోన్లను వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్‌ను ఈ చార్జర్‌తో చాలా వేగంగా చార్జ్ చేయవచ్చు. 0 నుంచి 58 శాతం చార్జింగ్ పూర్తయ్యేందుకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అలాగే కేవలం 15 నిమిషాలపాటు ఫోన్ చార్జింగ్ పెడితే 10 గంటల పాటు 4జీ కాల్స్ చేసుకునేంతటి చార్జింగ్‌ను ఈ చార్జర్ ద్వారా పొందవచ్చు. ఇక ఈ చార్జర్‌ను వినియోగదారులు ఎంఐ ఆన్లైన్ స్టోర్‌లో రూ.999 ధరకు కొనుగోలు చేయవచ్చు.