Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సొంత పార్టీపై విమర్శలు చేసి తీవ్ర సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు అదే తరహాలో వ్యాఖ్యానించారు. ప్యారడైజ్ పేపర్లలో తన కుమారుడు, కేంద్రమంత్రి జయంత్ సిన్హా పేరుండడంపై ప్రభుత్వం తప్పకుండా విచారణ జరిపించాలని యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. తన కుమారుడుతో పాటు ప్యారడైజ్ పాత్రల్లో ఏయే రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చాయో వారందరిపైనా విచారణ జరపాలని, 15 రోజులు లేదా నెలరోజుల్లో వారిని విచారించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే జయంత్ సిన్హా కేసుతో పాటు అమిత్ షా కుమారుడు జై షా కేసును కూడా విచారించాలన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక జైషా కంపెనీ ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయని ఆరోపిస్తూ ది వైర్ అనే వెబ్ సైట్ లో ఇటీవల ఓ కథనం వచ్చింది. దీనిపైనే విచారణ జరిపించాలని యశ్వంత్ సిన్హా డిమాండ్ చేస్తున్నారు. అయితే వెబ్ సైట్ కథనాన్ని సవాల్ చేస్తూ జై షా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అటు ప్యారడైజ్ పేపర్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ అధినేత జగన్ సహా అనేకమంది రాజకీయ నేతలు, సినీ నటులు, వ్యాపారస్థుల పేర్లు ఈ పత్రాల్లో వెలుగుచూశాయి. నల్లధనానికి స్వర్గధామాలైన దేశాలకు అక్రమమార్గాల్లో బ్లాక్ మనీని తరలించిన వారి పేర్లను ప్యారడైజ్ పత్రాలు వెలుగులోకి తెచ్చాయి.