ఈ తెలుగు డైరెక్టర్ కి బాలయ్య ఎవరో తెలీదంట !

Yatra Director Mahi v Raghav Comments On Balakrishna

ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీలకు ఏమైందో తెలియదు కానీ నందమూరి బాలకృష్ణ పై పడుతున్నారు. ఆయన వాళ్లను ఏం చేస్తున్నాడో తెలీదు కానీ ! ఇప్పుడు మరో దర్శకుడు కూడా నందమూరి బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదు అంటూ సమాధానం చెప్పి సంచలనం సృష్టించాడు. యాత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మహీ రాఘవ ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా బాలకృష్ణ గురించి అడిగారు విలేఖరులు. దాంతో ఎవరు ఊహించని సమాధానం చెప్పాడు మహి. తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని ఆయన సినిమాలు ఎప్పుడూ చూడలేదని అందుకే బాలయ్య గురించి తాను ఏమీ మాట్లాడలేనని అసలు నందమూరి బాలకృష్ణ అంటే ఎవరంటూ విచిత్రమైన సమాధానం చెప్పాడు మహీ. ఇప్పుడు ఈయన చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో ఉంటూ నందమూరి బాలకృష్ణ అంటే ఎవరో తెలియదా అంటూ ఆయనతో ఆడుకుంటున్నారు బాలయ ఫాన్స్. మిగిలిన వాళ్ళు కూడా మహిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంత పెద్ద హీరో తెలియదా అంటూ ఆయనను ఓ రేంజ్ లో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. యాత్ర సినిమా వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కించడంతో ఆయన జగన్ మనిషి అని తేలిపోయింది అంటున్నారు బాలకృష్ణ అభిమానులు. అందుకే కావాలని రెచ్చగొడుతున్నాడంటూ ఆయన మీద కామెంట్లు చేస్తున్నారు.