యాత్ర సెన్సార్ టాక్…కష్టమేనట…!

Director Mahi V Raghav Emotional Speech On Yatra Movie

వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీ ‘యాత్ర’ ఫిబ్రవరి 8న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సింగిల్ కట్ కూడా లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్‌ను అందుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. వైఎస్‌ఆర్ పాదయాత్రను కదాంశంగా తీసుకునో మూవీగా మలిచారు ‘ఆనందోబ్రహ్మ’ దర్శకుడు మహి రాఘవ. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టీ నటించారు. వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో ‘బాహుబలి’ ఫేం అశ్రితా వేముగంటి నటిస్తుండగా వైఎస్ తండ్రి పాత్రలో జగపతిబాబు, కేవీపీగా రావు రమేష్‌లతో పాటు సుహాసిని, పోసాని, యాంకర్ అనసూయ కీలకపాత్రలలో నటించారు.

నిన్న జరిగిన సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ‘యాత్ర’ మూవీ వైఎస్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్‌ని కూడా అలరించడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్ పాత్రలో మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేశారని కొన్ని ఎమోషన్స్ సీన్స్‌లో కంటతడి పెట్టించారంటున్నారు. రెండు గంటల ఆరునిమిషాల నిడివితో ఉన్న యాత్ర సినిమాలో హార్ట్ టచ్చింగ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయంటున్నారు. రేసీ స్క్రీన్ ప్లే‌తో సినిమా చాలా స్పీడ్‌గా ఉంటుందంటున్నారు. జగపతిబాబు పాత్ర ఈ సినిమాలో హైలైట్ కాబోతుందని అంటున్నారు. ఇక సినిమాలో వచ్చే ఎమోషన్ సీన్స్ చుసిన ప్రేక్షకులు కన్నీరు పెట్టకుండా బయటకు వెళ్ళడం కష్టమేనని అంటున్నారు.