పెదకూరపాడు నియోజకవర్గంలో జోరు మీదున్న వైఎస్సార్ సీపీ:
గుంటూరు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెట్ స్పీడులో దూసుకుపోతోంది. ఈ నియోజకవర్గంలో వరుసగా రెండు విడతలు టీడీపీ గెలిచింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గెలుపును దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రెండు నెలల కిందట ప్రముఖ నిర్మాణ సంస్థ శుభగృహ అధినేత నంబూరు శంకరరావును నియమించింది. ఆయన ఏరికోరి అతిపెద్ద సవాల్‌ను బలవంతంగా స్వీకరించారు. వైసీపీ ఇచ్చిన ఎన్నో ఆప్షన్లను కాదనుకుని తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి న్యాయం చేయాలనే తలంపుతో పట్టుబట్టి పెదకూరపాడులో పోటీ చేసే అవకాశాన్ని సాధించుకున్నారు. నాటి నుంచి ఇప్పటివరకు నియోజకవర్గంలో ఆయన పనితీరు చూస్తుంటే కదనరంగమే గుర్తొస్తోంది. ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఆయన పనితీరు ఉంది. విరామమెరుగకుండా పనిచేసుకుంటూ వెళుతున్నారు.
ఆర్థిక సాయాలు, సేవా కార్యక్రమాలు:
1. నియోజకవర్గంలో ఆయన చేస్తున్న సేవాకార్యక్రమాలు మరెవరికీ సాధ్యం కాని రీతిలో కొనసాగుతున్నాయి.
2. పేద మహిళలకు పెద్ద మనసుతో, ఎంతో దాతృత్వంతో ఆ కుటుంబం చేస్తున్న చీరల పంపిణీ కార్యక్రమం మహిళల్లో భరోసాను, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీపై గట్టి నమ్మకాన్ని నింపుతోంది.
3. ఎవరైనా సరే చర్చిలు, ఆలయాలు, మసీదుల నిర్మాణాల కోసం ఆర్థిక సాయం అడిగితే మారు ఆలోచన లేకుండా ఆర్థిక సాయాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.
4. ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తూ ఆపన్న హస్తం అందజేస్తున్నారు.
5. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నియోజకవర్గంలోని 4 మండలాల్లోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. క్రోసూరులో నియోజకవర్గ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటుచేసి పార్టీ కి వైభవం తీసుకొచ్చారు.
6. అనారోగ్యంతోగాని, ప్రమాదవశాత్తూగాని ఎవరు చనిపోయినా పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం చేస్తూ నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు.
జోరుగా పార్టీ కార్యక్రమాలు:
1. ఇప్పటివరకు కేవలం 30 రోజుల్లో నియోజకవర్గంలో ఏకంగా 40 గ్రామాల్లో శంకరరావు రావాలి.. జగన్ కావాలి.. జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారంటే ఆయన నియోజకవర్గంలో ఎంత ఉధృతంగా పర్యటిస్తున్నారో తెలుసుకోవచ్చు.
2. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్ను నమ్మం బాబు.. కార్యక్రమం ద్వారా ఆయన ప్రతి గ్రామంలోనూ టీడీపీ ఇచ్చిన 600 హామీల అమలు వైఫల్యం గురించి ప్రజలకు వివరించారు.
3. దాదాపు 80 శాతం గ్రామాల్లో ఇప్పటివరకు పదివేలకుపైగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పసుపు, కుంకుమ కూడా స్వయంగా కుటుంబ సభ్యులే పంపిణీచేశారు. నవరత్నాల కరప్రతాలను ఇంటింటికీ అందజేస్తున్నారు.
ఆకట్టుకున్న ఉద్యోగాల కల్పన:
నంబూరు శంకరరావు ఈ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి మండలంలో కనీసం 50 మందికి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి.. ఆ హామిని వంద శాతం నెరవేర్చే పనిలో ఉన్నారు. నియోజకవర్గంలో ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులకు కనీసం రూ.15వేలకు తగ్గకుండా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. నిరాశలో ఉన్న నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నారు.
పకడ్బందీగా పార్టీ నిర్మాణం:
నియోజకవర్గంలో గతంలో అస్తవ్యస్తంగా ఉన్న బూత్ కమిటీలను పూర్తిస్థాయిలో పట్టాలెక్కించారు. నియోజకవర్గంలోని ప్రతి బూత్‌కు కమిటీని వేసి, ఆ కమిటీలు చురుకుగా పనిచేసేలా దిశానిర్దేశం చేశారు. ఏ అవసరం వచ్చినా వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నారు. పార్టీ అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులను బూత్ కన్వీనర్‌లకు సమకూర్చుతున్నారు. బూత్ కమిటీలకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. పార్టీ గెలుపుకోసం ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం కానున్నాయో కాలమే నిర్ణయించాలి.