జగన్ అవినీతి నిజమేనేమో : వైసీపీ నేత

YCP Leader Sensational Comments On Jagan

తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై చీరాల వైసీపీ సమన్వయకర్త యడం బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు నుండీ ఆమంచి చేరికను నిరసిస్తూ వస్తున్న బాలాజీ వైసీపీ అధినేత జగన్‌ కు బాలాజీ బహిరంగలేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ఆమంచి మీద పలు ఆరోపణలు చేశారు. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో ఆమంచి ఆగడాలు తట్టుకోలేక తనను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఎన్‌ఆర్‌ఐగా ఉన్న తాను అన్నీ వదులుకుని 9ఏళ్లు పార్టీ కోసం పనిచేశానని, ఆమంచి లాంటి‌ రౌడీని పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా వినలేదని లేఖలో ఆరోపించారు. దుష్టశక్తులను పార్టీలో చేర్చుకున్నారంటే జగన్ అవినీతి కూడా నిజమనే భావన కలుగుతోందని, తన లేఖపై స్పందించకుంటే వైసీపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తానని యడం‌ బాలాజీ ప్రకటించారు. మరోవైపు యడం బాలాజీ టీడీపీలో చేరో యోచనలో ఉన్నారని అందుకే ఈ లేఖను విడుదల చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన అనుచరులతో మంతనాలు కూడా ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు విజయవాడకు చెందిన ఒకరిద్దరు టీడీపీ నాయకులు బాలాజీతో చర్చలు కూడా జరిపారు. ప్రస్తుతం యడం బాలాజీ రాసిన లేఖ చూస్తుంటే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనిపిస్తోంది. అయితే ఆయన టీడీపీలో చేరినా టికెట్ ఎవరికి ఇస్తారో చూడాలి. చీరాల టికెట్ రేసులో పోతుల కుటుంబం, పాలేటి రామారావు అధిష్టానం దృష్టిలో కరణం బలరాం ఉన్నారు/ చూద్దాం మరి యడం బాలాజీ ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తారో.