ఎన్నికల దగ్గర పడుతుండడంతో వైసిపి వ్యూహాలకు పదును పెట్టింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ‘పల్లెకు పోదాం’ పేరుతో కార్యక్రమం నిర్వహించనుంది. దీనిపై రోడ్ మ్యాప్ రూపకల్పనకు చర్చలు జరుగుతున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు… ప్రతి సచివాలయం పరిధిలో నాయకులు కలియ తిరుగుతారు.
మండలాధ్యక్షుడు రాత్రికి అక్కడే బస చేసి, గ్రామంలోని నేతల సమస్యలను పరిష్కరిస్తారు. పథకాల లబ్ధిదారులను కలిసి ప్రభుత్వ పనితీరును వివరిస్తారు. అయితే… వైసీపీ పార్టీ ‘పల్లెకు పోదాం’ పేరుతో కార్యక్రమం చేపట్టడంతో…ముందస్తు ఎన్నికలు ఏపీలో పక్కా అని అందరూ అనుకుంటున్నారు.
కాగా వచ్చే ఎన్నికలు టిడిపి-వైఎస్ఆర్సిపి మధ్య అని వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ ఎన్నికలను తోడేళ్ల గుంపు vs సింహం, అధికారం కోసం దురాశ vs ప్రజా సంక్షేమం, యుటర్న్ పాలిటిక్స్ vs విశ్వసనీయత, అస్థిరత్వం vs స్థిరత్వం, అవకాశవాదం vs నిజాయితీ, కుల రాజకీయాలు vs ఐక్యత, క్రోని క్యాపిటలిజం vs అందరికీ లబ్ధితో పోల్చవచ్చు.జగన్ vs అన్ని ప్రతిపక్షాలుగా ఎన్నికలు జరుగుతాయి’ అని ట్వీట్ చేశారు.