రాను రాను సినిమా ట్రెండ్ మారుతూ వస్తుంది. ఆ మార్పు శృతిమిచింతే ఎలా ఉంటుందో ఈ ఏడు చేపల కథ సినిమా ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. మొన్నంటే మొన్నే ఈ సినిమా యొక్క కత్తిరించబడని ట్రైలర్ అని చెప్పి ఇలా యూట్యూబ్ లో రిలీజ్ చేసారో లేదో, మిలియన్ వ్యూస్ తో ట్రైలర్ విజయపథాన దూసుకుపోతుంది. అన్నట్టు ఇందులో తెలిసిన హీరోనో, హీరోయినో ఉన్నారా అంటే అది లేదు.
బొత్తిగా చూడని ఫేసులే ట్రైలర్ నిండా. అయినా ఈ మిలియన్ వ్యూస్ కి కారణం ఏమిటో చెప్మా అంటే ఆ ట్రైలర్ లో ఉన్న బోల్డ్ కంటెంట్. బోల్డ్ అంటే అలాంటి ఇలాంటి బోల్డ్ కాదండోయ్. బాలీవుడ్ బోల్డ్ మూవీస్ కి ధీటుగా నిలబడేలా ఉన్న బోల్డ్. ఇక ట్రైలర్ గురించి చెప్పుకుంటే, ఇదొక పూర్తి అడల్ట్ కామెడీ మూవీ. టైటిల్ లో చెప్పినట్లుగా ఏడు చేపలు అంటే బహుశా మన హీరో గారు ఏడు మంది స్త్రీలతో చేసే యవ్వారం ని కథగా చెప్తున్నట్టుంది. చెప్పొద్దు కానీ, ఈ ట్రైలర్ లో కనిపించిన హీరో చూడటానికి పర్లేదులే అనిపించినా, ఆ క్యారెక్టర్ కి తగిన హడావిడి పెరఫార్మన్సుతో బాగానే దృష్టిని తీసుకున్నాడు. ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్ లో కొత్తే అని చెప్పొచ్చు.
అదే బాలీవుడ్ లో అయితే ఇలాంటి సినిమాలు షరా మామూలే. హాట్ స్టోరీ సిరీస్ అనో, రాగిణి ఎంఎంస్ సిరీస్ అనో , ఇంకేవో అనో సినిమాల్లోనే కాకుండా, వెబ్ సిరీస్ లను కూడా వదలరు. ఇటువంటి సినిమాల కేర్ అఫ్ అడ్రస్ గా చెప్పుకునే ఏక్తా కపూర్ అయితే ఆల్ట్ బాలాజీ అనే ప్రత్యేకమైన ఛానల్ ఒకటి ఇటువంటి కంటెంట్ కోసమే ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటుంది. మన తెలుగోళ్లు గురించి చెప్పాలంటే అర్జున్ రెడ్డి లోని లిప్ లాక్ సీన్స్ చూసే టీవీ చానెల్స్ కి ఎక్కి మరి రచ్చ రచ్చ చేశారు. మరి, ఈ సినిమా థియేటర్లలోకి వస్తే ఇంకెంత రచ్చ చేస్తారో ఏమో.
అభిషేక్ పచిపాల హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి స్ జ్ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, జివిన్ శేఖర్ రెడ్డి తమ చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. పనిలో పనిగా మీరు కూడా ఈ ట్రైలర్ పై ఒక లుక్ వేసి , ఆ ఏడు చేపల కథ ఎలా ఉండబోతుందో ఊహించేయండి.