ప్రభుత్వ సంస్కరణలతో రాష్ట్ర విద్యా వ్యవస్థలో మ్యాజిక్ జరుగుతోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో.. పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన 47 మంది విద్యార్థులను మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగాలి. నేడు మీరు సాధించిన విజయంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ఏపీ విద్యా వ్యవస్థకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రభుత్వ ఫలితాలపై పేపర్లలో ప్రకటనలు జారీచేస్తాం, అని మంత్రి అన్నారు.
