11వ యోగా ఇంటర్నేషనల్ డేను (Yoga International Day) ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నాగరికతకు భారతదేశం పెట్టింది పేరన్నారు. యోగా మన వారసత్వమని.. యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కారణమన్నారు. యోగా మెరుగైన జీవనానికి దోహద పడుతుందని తెలిపారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని చెప్పుకొచ్చారు. యోగా అనేది కొద్దిమందికో లేక.. కొన్ని ప్రాంతాలకో సంబంధించింది కాదన్నారు. అందరి జీవితాల్లో యోగా అనే ఒక భాగం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు.