కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నటుడికి ఈ రోజు ప్రత్యేకత కావడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీతారామం కో స్టార్ మృణాల్ ఠాకూర్ కూడా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా దుల్కర్‌కు బర్త్ డే విషెస్ చెప్పింది. విషెస్‌తో పాటు సీతారామం షూటింగ్ సమయంలో దుల్కర్‌తో దిగిన కొన్ని చిత్రాలను , కూడా తన హృదయపూర్వక సందేశాన్ని పంచుకుంది.
దుల్కర్ ‘సూపర్ హంబుల్ సూపర్ స్టార్’ అని ఈ పోస్ట్‌లో మృణాల్ మెన్షన్ చేసింది. మృణాల్ పోస్ట్‌పై దుల్కర్ కామెంట్ బాక్స్‌లో రిప్లై కూడా ఇచ్చాడు. సీతారామం ఓ మంచి ప్రేమకథా చిత్రం. ఈ మూవీ అందరి మదిలో చెరగని ముద్ర వేసింది. సినిమాలోని పాటలు, సీన్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలోని సీత, రామ్ క్యారేక్టర్లకు మృణాల్, దుల్కర్ లు వందకు వంద శాతం న్యాయం చేశారు. తమ సహజసిద్ధమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నారు.
మొదటి సినిమా అయినా తెలుగులో మృణాల్ ఎంతో అద్భుతంగా నటించింది. ఆమే నటనకి చాల మంది ఫిదా అవుతున్నారు . అయితే అందుకు కారణం మాత్రం దుల్కర్ అని తన తాజా పోస్టులో చెప్పుకొచ్చింది మృణాల్. దుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా అతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చింది. “ఎంత ఎత్తుకు ఎదిగినా గాని ఒదిగి ఉండటం, వినయం,విధేయత, ప్రతిభ, మంచి మనసు ఉన్న వ్యక్తి దుల్కర్. ఇలాంటి సూపర్ హీరో నాకు ఫ్రెండ్ అయ్యేలా చేసిన ‘సీతారామం’ టీమ్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా.అని చెప్పుకొచ్చారు .
దుల్కర్ నువ్వే నాకు ఇన్స్పిరేషన్. నిన్ను చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. కొత్త భాష నేర్చుకోవాలంటే భయపడే దానిని, కానీ నువ్వు నాలో ధైర్యాన్ని నింపావు. నా ఫస్ట్ తెలుగు మూవీని ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు.. థాంక్యూ సో మచ్. హ్యాపీ బర్త్‌డే దుల్కర్ ’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది మృణాల్.