తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని విశాఖకు చెందిన యువకుడిపై పూణే పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఆరేళ్ల క్రితం పూణేలో జర్మనీ లాంగ్వేజ్ ఇన్‌స్టిట్యూట్‌లో సదరు యువతికి విశాఖ నగరం మర్రిపాలేనికి చెందిన సుధీర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటికే ఆమెకు వివాహమై మూడేళ్లయింది.
తనకూ వివాహమైందని, తన భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మబలికి ఆమెకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆమె మూడు నెలల గర్భిణి. ఇదిలా ఉండగా తనను మోసం చేసి రహస్యంగా ఈ నెల 19న సింహాచలంలో మరో యువతిని వివాహం చేసుకున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై నగర పోలీసులను సంప్రదించగా.. తమకు ఎటువంటి సమాచారం రాలేదని వెల్లడించారు.