సంతానం కలగడం లేదని మనస్థాపం చెందిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జన్నారం మండలం చింతగూడలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం జన్నారం మండలం చింతగూడకు చెందిన సీపతి సిందూజ (22)కు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్‌తో మూడేళ్లక్రితం వివాహమైంది.
పిల్లలులేరని తరచూ బాధపడుతున్న మహిళ ఈనెల 5న ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి సేపూరి కమలాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.