భార్యతో దుర్భాషలాడాడన్న కోపంలో సొంత అన్ననే తమ్ముడు హతమార్చిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో గురువారం చోటు చేసుకుంది. ఉరవకొండకు చెందిన మల్లెష్ భార్యను ఇటీవల తన అన్న రామాంజనేయులు అసభ్య పదజాలంతో దూషించాడు.
ఈ విషయం మనసులో పెట్టుకున్న మల్లెష్ అన్న రామాంజనేయులును రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం అన్న మృతదేహం పక్కనే కూర్చుని మీడియాతో మాట్లాడాడు.