ఇటీవల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మంది గుండె పోటుకి బలైపోతున్నారు. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, యువతలో గుండెపోటు ఎక్కువగా వస్తోంది. తాజాగా పెద్దపల్లి లో విషాదం చోటు చేసుకుంది.
గుండెపోటుతో మృతి చెందిన అన్నకి అతని చెల్లెలు రాఖీ కట్టిన సంఘటన పెద్దపల్లి జరిగింది. అప్పటిదాకా సంతోషంగా ఉండి ధూళికట్టకి చెందిన చౌదరి కనకయ్య ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు. పుట్టెడు దుఖంతో ఆయన సోదరి గౌరమ్మ రాఖీ కట్టడానికి వచ్చింది, కానీ అదే కడసారి అవుతుందని అనుకోలేదు. కనుకయ్య మృతదేహానికి రాఖీ కట్టి అన్నను సాగనంపింది. చెల్లెలు అనురాగాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.