Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరు పెడతానని ప్రతిపక్ష నేత , వైఎస్ జగన్మోన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయాల్లో భాగంగా చేసినా అది ఇప్పుడు పెను ప్రకంపనలని సృష్టిస్తోంది. ఈ రోజు ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరును జగన్ సందర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లా పేరు మార్చి ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తామని ప్రకటించారు. సరిగ్గా ఎప్పుడు అయితే జగన్ ఈ ప్రకటన చేసాడో అప్పటి నుండి రాజకీయవర్గాలను షేక్ చేస్తోంది ఈ వార్త. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది. ఆ పార్టీ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలంటే క్షణాల్లో పని, కాని ఆ పార్టీ లో మురళీమోహన్, గల్లా జయదేవ్, బుద్ధా వెంకన్న వంటి నేతలు డిమాండ్ చేసినప్పటికీ అ డిమాండ్ డిమాండ్ గానే ఉండి పోయింది.
అప్పట్లోనే కృష్ణా జిల్లా నేతలు ఈ విషయాన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి ఎలా యిన తమ జిల్లాకి అన్న గారి పేరు పెట్టుకుందాం అని భావించారట. ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్ చేస్తున్న తమ ప్రభుత్వం… కనీసం ఆయన పేరుతో ఓ జిల్లాను కూడా ఏర్పాటు చేయలేకపోయిందనే అపవాదును తాము భరించాల్సి వస్తోందని బాబు దగ్గర మొర పెట్టుకుందాం అని భావించారు అయితే మరి విషయం బాబు దృష్టికి తీసుకెళ్ళారో లేదో గాని ఇప్పుడు సడన్ గా వైఎస్ జగన్ చేసిన ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీని షేక్ చేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఒకవైపు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయనను దింపి పారేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని గతం నుంచీ అటు వైఎస్ రాజశేఖరరెడ్డి కానీ, ఇటు జగన్ కానీ పదే పదే ప్రచారం చేస్తున్నారు.
అందుకు తగ్గట్టే ఇదంతా ముమ్మాటికీ నిజం అని వాదించే లక్ష్మి పార్వతిని కూడా జగన్ పక్కనే అట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమె చేత చంద్రబాబుకు ఎన్టీఆర్ మీద అంతగా ప్రేమ లేదన్న విషయాన్ని జనాల్లోకి చొప్పించే ప్రయత్నం ఈ విధంగా చేస్తున్నరా అనే అనుమానమూ కలగకమానదు. ఎందుకంటే సామాజిక పరంగా తీసుకుంటే జగన్ సామాజిక వర్గానికి చెందిన వారు దాదాపు జగన్ పార్టీ వైపే ఉన్నారు. కానీ టీడీపీ విషయానికి వస్తే బాబు సామాజిక వర్గం వారంతా బాబు వెనుక లేరు. అలాగే మిగిలి ఉన్న వారిని తన వైపుకు తిప్పుకునే విధంగా జగన్ ఈ ప్రకటన చసి ఉండచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఆచరణలో పెట్టని ఈ అంశం ఇప్పుడు జగన్ తన ఆయుధంగా మార్చుకున్నాడు అని చెప్పవచ్చు.