పంతులు పక్కన వున్నా పాఠం తప్పుగా చెప్పాడు.

YS Jagan Didn't Following Prashant Kishor Strategies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడూ ఎవరినీ ప్రత్యేకంగా గుర్తించలేదు. ఆయన అదనపు గౌరవం ఇవ్వాల్సి వస్తుందని వై.ఎస్ ఆత్మబంధువు గా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు ని కూడా దూరం పెట్టారు. కానీ అవసరం ఎంతటివాడినైనా మార్చేస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. జగన్ ఆయన్ని స్పెషల్ గా చూస్తున్నాడు. పార్టీ నేతలకు కూడా ప్రశాంత్ గురించి కాస్త గొప్పగానే చెబుతున్నాడు. ఆయన ఏఏ రాష్ట్రాల్లో ఎవరెవర్ని అధికారంలోకి తెచ్చాడో వివరంగా తెలియజెపుతున్నారు. జగన్ ఒకరి గురించి ఇలా గొప్పగా చెప్పడం వైసీపీ శ్రేణుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రశాంత్ ని గురువుగా భావిస్తున్నాడు. అయితే ప్రశాంత్ కి గౌరవం ఇవ్వడమంటే ఆయన మాటలు కూడా వినడం అని జగన్ మర్చిపోతున్నాడు. అందుకు ప్రబల సాక్ష్యం వైసీపీ ప్లీనరీ.

ప్రశాంత్ వైసీపీ కి ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడానికి ఒప్పుకున్న రోజే ఓ విషయం జగన్ కి ఓ విషయం చెప్పారు. అదేమిటంటే… పదేపదే నేను కాబోయే సీఎం అని చెప్పొద్దని జగన్ కి ప్రశాంత్ సలహా ఇచ్చారు. జగన్ కూడా ఆ తర్వాత కొన్నాళ్ళు ఆ సూచన పాటించారు. కానీ వైసీపీ ప్లీనరీ దగ్గరికి వచ్చేసరికి ప్రశాంత్ సూచనల్ని పట్టించుకోకుండా జగన్ రెచ్చిపోయారు. కార్యకర్తల జయజయధ్వానాల మధ్య తానే కాబోయే సీఎం అంటూ చెప్పడమే కాదు ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పరిపాలిస్తానని సగర్వంగా ప్రకటించారు. నాన్న వై.ఎస్ ఫోటో పక్కన నా ఫోటో కూడా పెట్టుకునేలా పాలన సాగిస్తానని జగన్ చెపుతుంటే వైసీపీ కార్యకర్తలు ఈలలు కేకలతో సభని దద్దరిల్లేలా చేశారు. వారి ఉత్సాహం చూసి జగన్ ఏమి చెబుతున్నాడు అని పక్క అతన్ని అడిగి తెలుసుకున్న ప్రశాంత్ కిషోర్ మొహం చిన్నబోయింది. అయినా పంతుల్ని పక్కనబెట్టుకుని పాఠం తప్పుగా చెబుతున్న జగన్ ని కంట్రోల్ చేసే శక్తి ఆయనకు ఉందా !.కాలంగడిచే కొద్దీ ఏఏ మాష్టారు ఆ స్టూడెంట్ నుంచి ఇలాంటి షాక్ లు ఇంకెన్ని తినాల్సివస్తుందో?

మరిన్ని వార్తలు:

గరగపర్రుపై ప్రశ్నించని పవన్