Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సీఎం చంద్రబాబుని కాల్చి చంపినా తప్పులేదు, ఆయన్ని ఉరి తీయాలి అని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు కాకతాళీయమో కాదు…రాజకీయం అంత కన్నా కాదు. రాజకీయాల్లో ఈ భాష పనికిరాదని చిన్న పిల్లలకు కూడా అర్ధం అవుతుంటే నాలుగు పదుల వయసులోనే కేవలం ఐదంటే ఐదేళ్లలో లక్ష కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన జగన్ అంతటి మహా మేధావికి తెలియదా ? తెలిసీ జగన్ అలా ఎందుకు మాట్లాడాడు ? అక్కడే వుంది అసలు కిటుకు. జయలలిత మరణం తర్వాత ఆర్కే నగర్ ఉపఎన్నికలకి ఈసీ ఏర్పాట్లు చేసింది. అక్కడ గెలుపు కోసం అన్ని పార్టీలు ధారాళంగా డబ్బు ఖర్చు చేశాయి. దీంతో ఎన్నికల సంఘం ఆ ఉప ఎన్నిక రద్దు చేసేసరికి తప్పు అందరిదీ వున్నా దినకరన్ మీద ఎక్కువ దృష్ఠి పడింది. ఇక్కడ నంద్యాలలో కూడా అలాగే ఎన్నిక రద్దు కావాలని, ఆ తప్పంతా అధికార పార్టీ మీదకి పోవాలని జగన్ భావించారు. దీనికి ఒకే ఒక్క కారణం ఓటమి భయం.
తాను చంద్రబాబుని తిడితే అధికార పక్ష నాయకులు కూడా అదే భాష వాడతారని జగన్ భావించారు. అక్కడే జగన్ పప్పులో కాలేశారు. జగన్ ఆలోచన పసిగట్టిన చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగిపోయారు. నంద్యాల ఉపఎన్నికల బాధ్యతలు చూస్తున్న నేతలు, మంత్రులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. జగన్ వ్యాఖ్యల మీద కౌంటర్ చేయండి గానీ ప్రతిగా తీవ్ర వ్యాఖ్యలు చేయొద్దని వారికి హితబోధ చేశారు. దానికి తగ్గట్టే వాళ్ళు జగన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు గానీ ఎదురు దాడి చేయకుండా సంయమనం పాటించారు. ఈ పరిణామాన్ని వూహించకుండా బాబుని తక్కువ అంచనా వేసి నంద్యాల ఉపఎన్నికల రద్దు కోసం పరోక్ష ప్రయత్నాలు చేసిన జగన్ కి నిరాశ తప్పలేదు.
మరిన్ని వార్తలు: