బాలయ్య రూట్ లోకి జగన్ .

ys-jagan-following-balayya-in-astrology-decisions

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓ మనిషి మారాలనుకుంటే ఎంతవరకు మారతాడో గానీ పరిస్థితులు తన్నుకొస్తే మాత్రం తప్పకుండా మారతాడు. వైసీపీ అధినేత జగన్ విషయంలో కూడా ఈ మాట నిజం అయిందంటున్నారు ఆయన సన్నిహితులు. ఒకప్పుడు గుడులు, గోపురాలు,పూజలు, ముహుర్తాలు అంటే జగన్ పెద్ద ఆసక్తి చూపే వారు కాదట. క్రైస్తవాన్ని ఫాలో అయ్యే ఇంటిలోనుంచి రావడంతో వీటి గురించి ఆయన పట్టించుకునే అవకాశం కూడా లేకపోయింది. 2014 లో ఓటమి తర్వాత సీన్ మారిపోయింది. జగన్ కొందరు స్వామీజీలు మరీ ముఖ్యంగా విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద మాట మీద నమ్మకం పెంచుకున్నారు. కానీ వాటిని ఫాలో కావడంలో పట్టువిడుపులు ఉండేవి. కానీ నంద్యాల ఉపఎన్నికల తర్వాత మాత్రం ఇలాంటి విషయాల్లో జగన్ వైఖరి పూర్తిగా మారిపోయిందట.

నంద్యాల ఉప ఎన్నికల ఫలితం తర్వాత జగన్ వైఖరిలో వచ్చిన మార్పుకి ఆయన పాదయాత్ర ముహూర్తం మార్చుకోవడమే పెద్ద సంకేతం అంటున్నారు. అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర షెడ్యూల్ మార్చుకోవడం వెనుక స్వామి స్వరూపానంద చెప్పిన మాట బాగా పని చేసింది అంటున్నారు. ఆయన సలహాలు, సూచనలకు అనుగుణంగా ప్రతి పనికి ముహూర్తం, వర్జ్యాలు లాంటివి చూసుకుని వెళ్తున్నారట. సీఎం చంద్రబాబు కి ఇలాంటి విషయాల్లో పట్టింపులు వున్నా లేకున్నా వాస్తు సహా కొన్ని విషయాల మీద ఆయన సతీమణి భువనేశ్వరికి బాగా నమ్మకం అట. ఇలాంటి విషయాల్లో బాబు కూడా ఆమె మాటకి విలువ ఇస్తారట. ఇక బాబు బావమరిది బాలయ్య అయితే ఈ ముహూర్తాల గురించి బాగా ఫాలో అవుతారు. ఇప్పుడు అనూహ్యంగా బాలయ్య అభిమాని అయిన జగన్ కూడా అదే రూట్ లోకి వచ్చాడని ఆయన పాత స్నేహితులు జోక్ చేసుకుంటున్నారట.