Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో సాక్షి పత్రిక ఆ వార్తలకు ఎంత కవరేజ్ ఇచ్చిందో చూసాం. ఇక ముద్రగడ పద్మనాభం ఆ ఉద్యమ సమయంలో ఏమి మాట్లాడినా టాప్ ప్రయారిటీ ఇచ్చింది సాక్షి. ఎప్పుడైతే కాపులకు 5 శాతం రిజర్వేషన్ కు చంద్రబాబు సర్కార్ ఓకే చెప్పిందో అప్పటి నుంచి సాక్షిలో ఆ వార్తలకు ప్రాధాన్యం తగ్గింది. ఇంతలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి వైసీపీ ని టార్గెట్ చేశారో అప్పటి నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. ఒకటిరెండు రోజులు పవన్ మీద ఎదురు దాడి చేయకుండా సంయమనం పాటించిన జగన్ ఆపై ఓర్చుకోలేకపోయారు. సాక్షితో పాటు వైసీపీ అనుకూల సోషల్ మీడియా కూడా జగన్ ఆలోచనలకు అనుగుణంగా జనసేన , పవన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
ఏ కాపు ఓట్లకోసం అయితే ఇన్నాళ్లు పవన్ విషయంలో జగన్ సంయమనం పాటించాడో ఇక ఆ సహనంతో ప్రయోజనం లేదని అర్ధం చేసుకున్నాడట. కాపు రిజర్వేషన్ ల విషయంలో చంద్రబాబు సర్కార్ ఓ నిర్ణయం తీసుకుని బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టడం, పవన్ వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ టార్గెట్ గా పనిచేస్తాడని అర్ధం కావడంతో ఇక కాపుల ఓట్లు తనకు రావని జగన్ కి అర్ధం అయిపోయిందట. అదే విషయాన్ని పార్టీ లోని సన్నిహితులతో చెప్పిన జగన్ ఇకపై పార్టీ లో కాపు నేతలకు ప్రాధాన్యం తగ్గించి బీసీ నినాదాన్ని బలంగా వినిపించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారట.
మున్ముందు కూడా పవన్ మీద విమర్శల దాడి ఉదృతం చేయాలని జగన్ వైసీపీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. దానికి తగ్గట్టే తన ప్రసంగాల్లోనూ పవన్ ని కేవలం ఓ యాక్టర్ గా చూపడానికి జగన్ ట్రై చేస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ని కూడా వై.ఎస్ ఇలాగే నటుడు తరహాలోనే సంబోధించారు. అయితే కాలంతో పాటు మార్పులు తప్పలేదు.తాను సీఎం అయ్యాక కూడా ఎన్టీఆర్ ని పొగడాల్సిన పరిస్థితి వై,ఎస్ కి ఏర్పడింది. ఇప్పుడు జగన్ మాత్రం అవేమీ ఆలోచించకుండా కాపు ఓట్లు వదిలేసుకొని పవన్ ని టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రభావం జగన్ అనుమున్నంత సామాన్యంగా మాత్రం ఉండకపోవచ్చు.