Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
” రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలు తప్ప.”… రాజకీయాల్ని కాచి వడబోసిన కొందరు మహానుభావులు చెప్పిన మాటలు ఇవి. ఆ మాటలు అక్షర సత్యాలని వైసీపీ అధినేత జగన్ విషయంలో మరోసారి రుజువు అయ్యింది. ఎవరు అన్ని అనుకున్నా, ఇప్పుడు ఏమి చూపినా ఏపీ కి ప్రత్యేక హోదా అంశం మీద జనం దాదాపుగా ఆశలు వదిలేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాలకి ఈ కోరిక లేదని కాదు. హోదా కావాలని వున్నా అందుకు అవసరమైన రాజకీయ చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదని వారికి అర్ధం అయ్యింది. ప్రతి పార్టీ వారి రాజకీయ అవసరాలకే ఈ అంశాన్ని లేవనెత్తుతున్న విషయం గుర్తించి అందుకు తగ్గట్టు వ్యవహరిస్తున్నారు ప్రజలు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే జనం మనస్సులో ఏముందో పసిగట్టడంలో పదేపదే విఫలం అవుతున్న జగన్ ఈ విషయంలోనూ ఫెయిల్ అయ్యారు. హోదా ఇస్తామని మాట మార్చిన బీజేపీ మీద జనం ఆగ్రహాన్ని అర్ధం చేసుకోకుండా ఆ పార్టీ తో జట్టు కట్టడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. అయితే ఆ ప్రయత్నాలు అంతగా సక్సెస్ కాలేదు. అయినా జగన్ ప్రయత్నాలు సాగుతూనే వున్నాయి. ఇలా చేస్తూనే ప్రత్యేక హోదా అంశాన్ని యువభేరి లో లేవనెత్తడం ఏంటని చాలా మందికి అర్ధం కావడం లేదు. దీని వెనుక పెద్ద విషయం ఏమీ లేదు. నంద్యాల, కాకినాడ ఫలితం తర్వాత ఆత్మవిశ్వాసం దెబ్బ తిన్న జగన్ ఇప్పుడు రాజకీయంగా చీమ చిటుక్కుమన్నా అయోమయానికి గురి అవుతున్నారట. అందుకే జనసేన అధినేత పాదయాత్ర లేదా ఇంకో రూపంలో రాష్ట్రం అంతటా పర్యటించి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించవచ్చన్న వార్తతో భయపడిపోయారు. అందుకే హఠాత్తుగా యువ భేరీ పెట్టి హోదా డిమాండ్ పెట్టారు. తద్వారా బీజేపీ కి దగ్గరయ్యే అవకాశాన్ని ఇంకా దెబ్బ తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఉదృత పర్యటనలతో జనసేన తన ప్రతిపక్ష పాత్ర కి కూడా ఎవరు పెడుతుందన్న భయంతో లేనిపోనివి మాట్లాడి మరోసారి ఎంపీ ల రాజీనామా అంశాన్ని ప్రత్యర్థి పార్టీలకి అస్త్రం గా ఇచ్చారు. ఈ విధంగా మళ్లీ డిఫెన్స్ లో పడిపోయారు. అయినా జగన్ ఓ విషయం గుర్తుంచుకోవాలి. అధికారం కోసం పోరాడితే ప్రతిపక్ష పాత్ర అయినా దక్కుతుంది. అసలు పోరాటమే ప్రతిపక్షం కోసం చేస్తే చివరకు ఏమి దక్కుతుంది ?