Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ వెంకయ్యనాయుడిని ప్రకటించగానే వైసీపీ అధినేత జగన్ ఆయనకు మద్దతు ప్రకటించారు. బీజేపీ నేతృత్వంలో లేని ఏ పార్టీ కూడా ఇంత స్పీడ్ గా నిర్ణయం తీసుకోలేదు. అసలు అభ్యర్థి ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నంతగా జగన్ ప్రవర్తన వుంది. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రయత్నం అంటూనే ఇంకో వైపు ఆ వ్యవహారం ఇక గతం అని తేల్చేసిన వెంకయ్యనాయుడుకు ఈ స్థాయిలో, ఇంత వేగంగా జగన్ మద్దతు ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది .
రాజకీయాలపై కనీస అవగాహన లేని వాళ్ళు, జైలుకి వెళ్లొచ్చిన వాళ్ళు, అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు పార్టీలు నడిపిస్తున్నారని వెంకయ్య ఎన్నో సందర్భాల్లో వైసీపీ ని చెడుగుడు ఆడేశారు. ఇప్పుడు కూడా ఉప రాష్ట్రపతి అభ్యర్థి అని బీజేపీ ప్రకటించింది గానీ మద్దతు ప్రకటించమని వెంకయ్య ఇంకా వైసీపీ ని కోరనే లేదు. అయినా జగన్ ఆయనకి మద్దతు ప్రకటించడానికి తహతహలాడిపోయారు. ఇక జగన్ కూడా వెంకయ్యని టార్గెట్ చేయడంలో తక్కువేమీ కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ని జంట పత్రికలుగా ఉతికి ఆరేసిన రీతిలోనే చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు అంటూ బహిరంగ సభల్లో పెట్రేగిపోయిన విషయం ఇంకా కళ్ళలో మెదులుతూనే వుంది. అలాంటి వెంకయ్యకి ఇంత ఆత్రంగా మద్దతు ప్రకటించిన జగన్ ని చూస్తుంటే అక్రమార్జన కేసులు ఆయన్ని ఎంతగా భయపెడుతున్నాయా అర్ధం అవుతుంది. ఇక ఆయన మాటలకి, చేతలకు పొంతన లేదని ఇంకోసారి తేలిపోయింది.
మరిన్ని వార్తలు