విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని పరామర్శించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. ములాఖత్‌లో వైఎస్ జగన్ వంశీని కలిశారు. ములాఖత్ ముగిశాక బయటకు వచ్చి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుందని, కేసు పెట్టలేదని సత్యవర్ధనే కోర్టుకు చెప్పాడని అన్నారు. సత్యవర్ధన్ వాంగ్మూలం కూడా నమోదు చేశారన్నారు. వంశీపై కావాలనే తప్పుడు కేసులు నమోదు చేసినట్లు జగన్ ఆరోపించారు.