జగన్ మీద కత్తితో దాడి అంటే ఫ్యాక్షన్ నేపధ్యమున్న కుటుంబం కావడంతో పెద్ద పెద్ద కత్తులు, బాంబులతో దాడి జరిగిందని అందరూ భావిచారు. కాని ఇక్కడ బయటపడ్డ విషయం ఏంటంటే అతను ఎవరో బయట వ్యక్తే కానీ జగన్ అభిమాని అట. కోడి పందాల కత్తి తీసుకొచ్చి, చిన్న గాయం చేసాడు. ఏది ఏమైనా కత్తి చిన్నదైనా, పెద్దదైనా, దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా ఇలా చేయడం దారుణం. భౌతిక దాడులు అనేవి, ఎవరూ హర్షించరు.
అయితే విమానాశ్రయంలో భద్రతా వ్యవహారం అంతా సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంటుంది. స్థానిక పోలీసులకు ప్రమేయం ఉండదు. లోపల ఏమైనా జరిగితే బయట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తారు తప్ప మిగతా భద్రతా ఏర్పాట్లు మాత్రం సీఐఎస్ఎఫ్ చూస్తుంది. ఇక విమానాశ్రయంలో అత్యంత పకడ్బందీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. ఎలాంటి చిన్న మారణాయుధాల్ని కూడా అనుమతించరు. కనీసం రేజర్ బ్లేడ్ లాంటవి కూడా వాటికి ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి. అలాంటి భద్రతా వ్యవస్థ ఉన్న చోట హత్యాయత్నం చేసిన శ్రీనివాస్ కత్తిని ఎలా తీసుకెళ్లాడనేది మిస్టరీగా మారింది.
సోదాలు చేయడంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా..? లేక హోటల్ లో వంట అవసరాల కోసం అని లోపలికి తెచ్చారా..? లేక ముందస్తు ప్లాన్ ప్రకారమే.. అనుమతించారా.. అన్నది తేలాల్సి ఉంది..! కానీ రాష్ట్రంలో కేంద్రం ఆడుతున్న దారుణమైన రాజకీయ క్రీడలో, ఇలాంటి సంఘటన ఎదో జరుగుతుందని అందరూ అనుకుంటూనే ఉండగా సంఘటన జరిగింది. అయితే, ఎప్పటిలాగే సాక్షి, వైసీపీ రెచ్చిపోతున్నాయి. ఇది ఏపి ప్రభుత్వం వైఫల్యం అంటున్నాయి.
చంద్రబాబుకు పాలన చేతకాదు ఈ దాడి చంద్రబాబు చేపించారు అంటున్నాయి. అలా అయితే కడప నుంచి, 12 జిల్లాలు దాటుకుంటూ, 3 వేల కిలో మీటర్లు, దారి పొడువునా, దాదాపు సంవత్సరం పాటు నడుచుకుంటూ వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి, సెక్యూరిటీ ఇచ్చింది ఏపి ప్రభుత్వం. ఒక్కసారి తేనెటీగల మందను ఆ పార్టీవాళ్ళే రెచ్చగొట్టడం మినహాయించి కనీసం ఒక చీమ అయినా జగన్ ను కుట్టిందా ? అన్ని జిల్లాల పోలీసులు ఎలా బందోబస్తు ఇచ్చారో తెలియదా ? అలాంటింది జగన్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళటం, లాంజ్ లో వెయిట్ చేయడం, సేల్ఫీ కోసం వచ్చిన ఆయన అభిమానే ఆయన్ను కత్తితో పొడవటం ఏంటి ? దానికి చంద్రబాబుని నిందించటం ఏంటి ? జగన్ చుట్టూ ఉండే ప్రైవేట్, ప్రభుత్వం కల్పించిన గన్ మెన్ లు ఏమయ్యారు ? ఇవన్నీ ఆలోచించక కేవలం చంద్రబాబు మీద తోసెయ్యటం ఏంటి ?
అంతేకాక ఇదే విషయం గురించి కొన్ని అనుమానాలు పరిశీలిస్తే ఫ్రీ గా రోడ్ల మీద తిరుగు తున్నంత కాలం జరగని దాడి ఫుల్లీ సెక్యూర్డ్ ప్లేస్ ఐన ఎయిర్ పోర్టులో దాడి చేయడం ఒకటి అయితే, గతంలో జరిగిన ఎయిర్ పోర్టు గొడవ – ఈసారి ఈ దాడి రెండూ విదేశీ కంపేనీలతో ప్రభుత్వం పెట్టుబడులకై ఒప్పందాలు చేసే టైములోనే జరగటం, మరోపక్క ఇంటర్నేషనల్ వండే మ్యాచుతో ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తున్న తరుణంలో దాడి జరగండం, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పేలా చేసి రాష్ట్రాన్ని నాశనం చేయాలని కుట్ల పన్నుతున్నారని నటుడు శివాజీ చెప్పిన విధంగానే జరగటం, స్టేటు గవర్నమెంటు కంట్రోల్ లో లేని చోట జరిగిన సంఘటనకి దాడి జరిగీ జరంగంగానే వైసీపీ బీజేపీలోని జీవీఎల్, కన్నా లాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని స్టేట్మెంట్లివ్వటం ఇలా ఈ దాడికి సంబంధించి అన్ని విషయాలు అనుమానాస్పదంగానే తోస్తున్నాయి. అయితే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే జగన్ ఫ్యాన్ అని చెప్పుకుంటూ తన ఊరిలో ఫ్లెక్సీలు సైతం కట్టిన ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు జగన్ ని ఎందుకు పొడిచాడు అనేది ?