వైసీపీ మ్యానిఫెస్టో…సంక్షేమానికే పెద్ద పీట !

jagan

వైసీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విడుదల చేశారు. తమ మేనిఫెస్టో 2014లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలా కులానికో పేజీతో, 650 హామీలతో పెద్ద పుస్తకంలా ఉండదని ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చని చంద్రబాబులా కాకుండా, ప్రజలకు తాను చేయబోయే అంశాలతో మాత్రమే దీన్ని తయారు చేశామని, ఐదేళ్ల తరువాత ఇవే హామీలను తాను నెరవేర్చానని చెబుతూ, మరోసారి ఓటు అడిగేలా ఉంటుందని అన్నారు. ఓ పెద్ద పాంప్లెట్ సైజ్ లో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించారు. గతంలో జగన్ ప్రకటించిన నవరత్నాలన్నీ ఇందులో వున్నాయి.

మేనిఫెస్టో ముఖ్యాంశాలు…

  • ప్రతి రైతు కుటుంబానికీ పెట్టుబడి కోసం రూ. 50 వేలు.
  • పంట వేసే సమయానికే మే నెలలో రూ. 12,500.
  • పంట బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
  • ఉచిత బోర్లు, పగటి పూట 9 గంటల కరెంట్, ఆక్వా రైతులకు యూనిట్ రూ. 1.50కే విద్యుత్.
  • రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
  • పంట వేసే ముందే రేటు, గిట్టుబాటు ధరకు గ్యారంటీ.
  • రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధి.
  • ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగి.
  • రెండో ఏడాది నుంచి సహకార రైతుకు పాలు ఇచ్చే పాడి రైతుకు లీటరుకు రూ. 4 బోనస్.
  • ప్రమాదమైనా, ఆత్మహత్య అయినా రూ. 7 లక్షల బీమా.
  • ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టం.
  • కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. పంటకు సంబంధించిన రాయితీలు, ప్రయోజనాలు.
  • వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ అమలు.
  • అన్ని వర్గాలకూ వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే పథకం అమలు.
  • ఎన్ని లక్షలు ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.
  • ఏ ప్రాంతంలో చికిత్స చేయించుకున్నా ఉచితమే.
  • చికిత్స తరువాత కోలుకునేంత వరకూ కుటుంబానికి సాయం.
  • పిల్లల చదువులన్నీ ఉచితం.
  • బిడ్డను బడికి పంపే తల్లికి సంవత్సరానికి రూ. 15 వేలు.
  • పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు వసతి కోసం విద్యార్థికి ఏటా రూ. 20 వేలు.
  • పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు.
  • వికలాంగులకు, వృద్ధులకు రూ. 3 వేల పెన్షన్.
  • ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు.
  • స్థలం లేని వారికి ఉచిత స్థలం. మహిళల పేరిట రిజిస్ట్రేషన్.
  • ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ అలుపెరగని పోరు.
  • ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు.
  • 50 ఇళ్లకు ఒకరి చొప్పున నెలకు రూ. 5 వేల గౌరవ వేతనంతో వాలంటీర్ల నియామకం.
  • అన్ని ప్రభుత్వ పథకాలనూ ఇంటి వద్దకే చేరుస్తాం.
  • ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు
  • గవర్నమెంట్ కాంట్రాక్టులు నిరుద్యోగ యువతకు ఇచ్చేలా చట్ట సవరణ.
  • సబ్సిడీపై యువతకు కావాల్సిన మౌలిక వసతులు.
  • వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళల రుణాలు దశలవారీగా మాఫీ
  • మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు.
  • మూడు దశల్లో మద్యపాన నిషేధం.
  • మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తాం.
  • అగ్రీ గోల్డ్ బాధితులకు రూ. 1100 కోట్ల కేటాయింపు.
  • తిరుమల శ్రీవారి ఆలయం తలుపులను సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయ పునరుద్ధరణ.
  • సొంత ఆటో, టాక్సీ నడిపేవారికి సంవత్సరానికి రూ. 10 వేలు.
  • 18 నుంచి 60 ఏళ్ల వయసువారికి రూ. లక్ష బీమా
  • సహజమరణమైనా కుటుంబానికి ఆ డబ్బు చెల్లిస్తాం.
  • ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు పారదర్శకంగా ఉండేలా చూస్తాం.
  • ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తాండాల్లో ఏడాదికి 2 వేల యూనిట్ల ఉచిత కరెంట్ లేదా రూ. 6 వేలు.
  • ప్రతి ఐటీడీఏ పరిధిలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
  • గిరిజనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన అన్ని హామీల అమలు.
  • మాతృభాష పరిరక్షణకై విద్యార్థులకు తెలుగు తప్పనిసరి.
  • జర్నలిస్టులకు వారి ప్రాంతాల్లోనే ఇంటి స్థలాలు.
  • అర్చకుల పదవీ విరమణ నిబంధన రద్దు.
  • అర్చకులకు ఇళ్ల స్థలాల కేటాయింపు.
  • దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యాల కోసం నిధులు.
  • దేవాలయాలకు పంచాయతీ జనాభా ప్రకారం రూ. 10 వేల నుంచి రూ. 35 వేలు.
  • మైనారిటీల ఆస్తులను సర్వే చేయించి డిజిటలైజేషన్.
  • ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి.
  • సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ.
  • ఉద్యోగులు కోరుకున్న విధంగా 26 శాతం ఐఆర్, సకాలంలో పీఆర్సీ అమలు.
  • అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్.
  • సీనియారిటీ, అర్హతలను బట్టి రెగ్యులరైజేషన్.
  • పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు.
  • ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణం.
  • అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు తెలంగాణ ఇస్తున్న వేతనం కన్నా రూ. 1000 అదనంగా జీతం.
  • ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలం లేకుంటే, వారి ప్రాంతంలో ఇళ్ల స్థలం.
  • పరిశ్రమల కోసం మరిన్ని ప్రోత్సాహకాలు.
  • నిరుద్యోగ యువకులకు సబ్సిడీ ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తాం.