Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
YSRCP Leader Ambati Rambabu Fires on CM Chandrababu Naidu
హెరిటేజ్ వ్యాన్ లో ఎర్ర చందనం దుంగలు పట్టుబడటం అంబటికి పండగైంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడనన్న చందంగా బాబుపై విరుచుకుపుడుతున్నారు. బాబుకు గతంలో కూడా స్మగ్రర్లతో సంబంధాలు బయటపడ్డాయని కారుకూతలు కూస్తున్నారు. చంద్రబాబుకు అంత సన్నిహిత సంబంధాలుంటే.. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టాస్క్ ఫోర్స్ ఎందుకు వేస్తారని తమ్ముళ్లు నిలదీస్తున్నారు. అంబటి వ్యాఖ్యలకు ఘాటుగా రియాక్షన్లు వస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అంబటి ఖాళీగా ఉండి టైమ్ పాస్ మాటలు మాట్లాడుతున్నారని సత్తెనపల్లిలో ప్రచారం జరుగుతోంది. ఈసారి అక్కడ జిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇటు జగన్ కూడా అంబటిని పట్టించుకోవడం లేదు. దీంతో వీరావేశంతో డైరక్టుగా బాబును టార్గెట్ చేస్తున్నారు రాంబాబు. చంద్రబాబు తలుచుకుంటే అంబటి గతేంటన్నది అందరికీ తెలుసు. ఇప్పటికైనా గౌరవంగా మాట్లాడాలని టీడీపీ నేతలు వార్నింగులు ఇస్తున్నారు.
హెరిటేజ్ వ్యాన్ లో దుంగలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అది నకిలీ వ్యాన్ అని తేల్చారు. తమిళనాడు వ్యాన్ కు హెరిటేజ్ స్టిక్కర్ అంటించారని క్లియర్ గా చెప్పారు. అంత చెప్పాక కూడా టీడీపీ దొంగలే వాళ్లని, అందుకు బాబు సహకారం ఉందని అంబటి అల్లుతున్న కథకు అంతం లేకుండా ఉంది. ఇలాగే కొనసాగితే అంబటిపై పరువు నష్టం దావా వేస్తామంటున్నారు తమ్ముళ్లు.
మరిన్ని వార్తలు: