వైసీపీకి షాకిస్తూ టీడీపీలోకి కీలక నేత…!

YSRCP Nellore Activist Joined In TDP

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా అధికార పార్టీ తెలుగు దేశం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ హోరాహోరీగా పోటీపడనున్నాయని స్పష్టమవుతోంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో ఆంధ్రాలో జరిగిన అభివృద్ధి చూసి ఇప్పటికే చాలామంది వైసీపీ నేతలు టీడీపీ గూటికి చేరిపోగా.. తాజాగా మరో బడానేత వైసీపీకి షాకిస్తూ టీడీపీలో చేరనున్నాడనే వార్త ఆ పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఏకంగా 24 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి షాక్‌ ఇచ్చి సైకిల్‌ ఎక్కారు. అయినా కూడా ఆ పార్టీ అధినేత జగన్‌ మైండ్‌ సెట్‌ మాత్రం మారలేదు. తమ నాయకులు పార్టీని వీడటానికి కారణాలేంటి అనే కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తూ టీడీపీ వారిని కొనేసింది అంటూ స్టేట్మెంట్ లు ఇచ్చి ఊరుకున్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా ఏసీపీ అధినేతలో మార్పు రాకపోవటం, ఆయన ఒంటెత్తు పోకడ ఆ పార్టీ నేతలకు తీవ్ర నిరాశే మిగుల్చుతోండట. ఈ నేపథ్యంలో కనీసం తమ రాజకీయ భవిష్యత్ నైనా కాపాడుకుందామనే ఉద్దేశ్యంతో పార్టీ నేతలు టీడీపీ గూటికి చేరుతున్నారట. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొల్లి లక్ష్మయ్య నాయుడు తాజాగా వైసీపీకి గుడ్‌ బై చెబుతున్నారని, ఆయన త్వరలోనే టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబుతో ఏకాంతంగా 30 నిముషాల పాటు భేటీ అయిన ఆయన బాబు ఇచ్చిన హామీలతో ఆయన సంతృప్తి చెందారట త్వరలోనే బాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారట. ఇదిలాఉంటే గతంలో తెలుగుదేశం తరఫున నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్‌కు పెద్ద పీట వేసినా ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ వీడి వైసీపీలో చేరారు. దీంతో ఆయనను ఆత్మకూరు నియోజకవర్గం గడప దాటకుండా చేయాలని చంద్రబాబు స్కెచ్‌ వేశారట. ఈ స్కెచ్ లో భాగమే గతంలో అక్కడ నుండి వైసీపీ తరఫున పోటీ చేసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించటం, తాజాగా కొల్లి లక్ష్మయ్య నాయుడుతో టీడీపీ సంప్రదింపులు అనేది టాక్. కాగా ఈ రెండు పరిణామాలతో టీడీపీని వీడిన ఆనంకు ఆత్మకూరులో ఊహించని షాక్‌ తగిలినట్లే అవుతుంది.