మొన్న పవన్ అయితే ఇప్పుడు జగన్…

YSRCP party Deeksha on April 30 at Vizag

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రత్యేక హోదా మీద కేంద్రం చేసిన వంచన ని బయట పెట్టేందుకు తన పుట్టినరోజున చంద్రబాబు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఆ దీక్ష మీద ఉన్న కవరేజ్ తగ్గించి బాబు దీక్షని తేలిక చేసే ప్రయత్నం జరిగింది. అయితే ఈ ప్లాన్ అంతా బీజేపీదే అని కొందరు విశ్లేషిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో సారి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేపట్టే కార్యక్రమానికి ఈ సారి వైఎస్ జగన రెడ్డి కౌంటర్ సిద్ధం చేశారు. ఈ నెల 30న చంద్రబాబు తిరుపతిలో దీక్ష చేపట్టనున్న నేపధ్యంలో ఆయన దీక్ష మీదనున్న కాన్సన్ట్రేషన్ ని కొంత మేరకి అయిన తప్పించేందుకు ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో వంచన దినం పేరిట ఆందోళన చేపట్టాలని ఆయన నాయకులను ఆదేశించారు.

చంద్రబాబు తిరుపతిలో దీక్ష చేపట్టే అవకాశం ఉండటంవల్లనే దానికి విరుగుడుగానే వంచన దినం కార్యక్రమాన్ని చేపట్టాలని జగన్ పార్టీ నాయకులను ఆదేశించినట్లు అర్థమవుతోంది. చంద్రబాబు దీక్ష చేపట్టే 30వ తేదీన విశాఖలో వంచన దినం పేరిట పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు 12 గంటల పాటు ఉపవాల దీక్ష చేపట్టాలని జగన్ సూచించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు దీక్షల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని, చంద్రబాబు వంచనను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి నల్లదుస్తులు ధరించి వంచన దినం పాటించాలని కూడా జగన్ నాయకులని కోరారు.