యుద్ధం శరణం… తెలుగు బులెట్ రివ్యూ

yuddham sharanam Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  నాగ చైతన్య , శ్రీకాంత్ , లావణ్య త్రిపాటి , రావు రమేష్ , రేవతి 
నిర్మాత :     సాయి కొర్రపాటి 
దర్శకత్వం :    కృష్ణ మరిముతు 
మ్యూజిక్ డైరెక్టర్ :  వివేక్ సాగర్ 
ఎడిటర్ :     క్రిపాకరన్ 
సినిమాటోగ్రఫీ : నికేత్  బొమ్మిరెడ్డి 

కథ…

సమాజానికి ఏదో మంచి చేద్దామనుకునే మురళి దంపతుల జీవితం హాయిగా సాగిపోతుంటుంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరు అర్జున్( నాగ చైతన్య ) . తండ్రి స్నేహితుడి కుమార్తె తో ప్రేమలో పడి ఆ విషయాన్ని తండ్రికి చెప్పడానికి సతమవుతుంటాడు. తన తల్లిదండ్రుల 30 వ పెళ్లి రోజు సందర్భంగా కొన్ని సర్ఫరైజ్ లు ఇవ్వడానికి పిల్లలంతా కలిసి ఆ దంపతుల్ని బయటికి పంపిస్తారు. ఆ తరువాత వారి జాడ కనిపించకుండా పోతుంది. వారిని వెదుక్కుంటూ బయలుదేరిన అర్జున్ కి శవాలుగా కనిపిస్తారు.అయితే అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని వారిని హత్య చేసారని తెలుస్తుంది. ఆ హత్యలతో పాటు అంతకు ముందు సిటీ లో జరిగిన బాంబు బ్లాస్ట్ లకి సంబంధం ఉందని తెలుస్తుంది. ఆ కుట్ర సూత్రధారి, పాత్రధారులని అర్జున్ ఎలా మట్టి కరిపించాడన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ…

ఈ సినిమా టైటిల్ యుద్ధం శరణం, ఈ కథని ఇంతకు ముందు నిర్మాత సురేష్ బాబు కూడా ఓకే చేశారు, ఈ సినిమాని ప్రస్తుతం అభిరుచి వున్న నిర్మాత సాయి కొర్రపాటి వారాహి బ్యానర్ మీద చేశారు, ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా రాజమౌళి తనయుడు కార్తికేయ పని చేసాడు, ఇక ఈ చిత్రానికి కథ ఇచ్చింది నాని జెంటిల్ మెన్ స్టోరీ రాసిన మలయాళ రచయిత డేవిడ్, చిత్ర దర్శకుడు కృష్ణ మారిముత్తు హీరో చైతు కి చిన్ననాటి స్నేహితుడు…ఇలాంటి విషయాలన్నీ యుద్ధం శరణం మీద అంచనాలు పెంచాయి. అయితే ఏ ఒక్క దశలో కూడా ఆ అంచనాలకి తగినట్టు సినిమాని మలచడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయారు.

ఎప్పుడో 40 , 50 ఏళ్ళనాడు వచ్చిన కథ ని ఇప్పటి కాలానికి తగినట్టు తీయడం తప్ప ఎక్కడా కొత్తదనం లేదు. ఏదో ఒకటిరెండు సీన్స్ తప్ప ఎక్కడా ప్రేక్షకుడు కధలోని భావోద్వేగాలతో కనెక్ట్ కాలేకపోయాడు. ఎందుకంటే ఇదంతా ఎన్నో సినిమాల్లో చూసి చూసి వున్నాడు కాబట్టి. తీసుకున్న కథని దర్శకుడు చెడగొట్టాడు అనలేకపోయినా అసలు ఎంచుకున్న కథలోనే పస లేదు కాబట్టి సినిమా తేలిపోయింది. హీరో లవ్ ట్రాక్, హీరో తల్లిదండ్రుల సామాజిక బాధ్యత గురించి సీన్స్ పర్లేదు అనిపించినా ఎక్కడా ప్రేక్షకుడి ఊహకి మించిన విషయం లేకుండా పోయింది. పైగా ఇది హీరో , Vila మధ్య మైండ్ గేమ్ తో కూడిన సినిమా అని ప్రచారం జరగడంతో ఇంకాస్త నిరాశ. కొత్తదనానికి ప్రేక్షకుడు జై కొడుతున్నదని బాక్సాఫీస్ వద్ద ఈ మధ్య చాలా సినిమాలు నిరూపించాక కూడా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి పాత చింతకాయ పచ్చడి సినిమాలు రావడం, అందులోను మొత్తం కుర్రకారు ఈ సినిమాకి పనిచేయడం చూస్తుంటే బాధ కలుగుతుంది. కాస్త కొత్తగా ఆలోచించండి బాబు అని ప్రేక్షకులు గట్టిగా అరిచి చెప్పాలనిపిబిచిన సినిమా ఇది.

యుద్ధం శరణం గురించి కొన్ని పాజిటివ్ అంశాలు చెప్పుకోవాల్సివస్తే నటీనటుల ప్రతిభ. హీరో చైతు నటనలో ఈజ్ పెరిగింది. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో చైతు బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇక విలన్ శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమధ్య దాకా అతను హీరోగా చేసాడు అన్న విషయం ఎక్కడా గుర్తుకు రాకుండా విలనీ పండించాడు శ్రీకాంత్. అతని నటనలో ఇంటెన్సిటీ సూపర్బ్, తెలుగు తెరకి మరో చెప్పుకోదగ్గ విలన్ దొరికినట్టే .ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి, రావు రమేష్, రేవతి కూడా చాలా బాగా చేశారు. అయితే వీళ్ళ ప్రతిభ ఇలాంటి సినిమాతో పనికి రాకుండా పోయిందే అనిపిస్తుంది. మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్.

ప్లస్ పాయింట్స్ …
చైతు, శ్రీకాంత్ సహా నటీనటులు
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ …
కథ
కధనం
దర్శకత్వం

తెలుగు బులెట్ పంచ్ లైన్ … “యుద్ధం శరణం ” సీట్ లో కూర్చున్న ప్రేక్షకుడికి.
తెలుగు బులెట్ రేటింగ్ … 2 .5 /5 .

మరిన్ని వార్తలు:

‘ఫిదా’ కంటే పెద్ద హిట్‌!

మోక్షజ్ఞ లవ్ స్టోరీ కి అతనే కర్త,కర్మ,క్రియ ?

బాలయ్యకు ఎలా పిలిస్తే ఇష్టమో తెలుసా?