ధోనీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్

ధోనీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన క్రికెట్ చరిత్రలో పలు ఆసక్తికర. విషయాలను వెల్లడించారు. అయితే 2007 వరల్డ కప్ సమయంలో 6 బంతులకు 6 సిక్సులు కొట్టి అద్భుత ఆటతీరు నీ కనబరిచారు. అంతేకాక ఈ సిక్సుల మోతతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. అయితే ఈ ఆరు సిక్స్ లు కొట్టడం తో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కంగు తిన్నారు. అయితే యువరాజ్ బాదిన ఆ బ్యాట్ లో ఏదో ఉంది అంటూ ఆ బ్యాట్ పై అలువురు సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిపారు. అంతేకాక ఆ రెండు మ్యాచ్ ల తర్వాత అప్పటి ఆసీస్ కోచ్ తో పాటుగా గిల్ క్రిస్ట్ సైతం ఆ బ్యాట్ పై అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిపారు. అయితే ఆ బ్యాట్ నీ చెక్ చేసుకోండి అంటూ యువి తెలిపిన విషయం గుర్తు చేశారు. మ్యాచ్ రిఫరీ సైతం బ్యాట్ నీ చెక్ చేసినట్లు తెలిపారు.

అయితే అప్పట్లో ఆల్ రౌండర్ గా యువరాజ్ సింగ్ అద్భుత మైన ఆట తో ప్రత్యర్ధి జట్టులను సైతం ఆకర్షించాడు. అయితే ఆ బ్యాట్ తనకు ఎంతో ప్రత్యేకం అని యువి వ్యాఖ్యానించారు. అంతేకాక 2011 లో వరల్డ్ కప్ కి ఆడిన బ్యాట్ కూడా చాలా ప్రత్యేకం అని అన్నారు. ధోనీ అప్పట్లో రైనా కు బాగా మద్దతు ఇచ్చాడని అన్నారు. అయితే 2011 వరల్డ కప్ కు ఎంపిక సమయంలో టీం లో ఎడమ చేతి వాటం స్పిన్నర్ లేకపోవడం వలన తనను తీసుకున్నట్లు తెలిపారు. అయితే 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబర్చడమే కాక, మ్యాన్ ఆఫ్ ది సీరీస్ సైతం గెలుచుకున్నారు. అయితే తాజాగా యువరాజ్ గంగూలీ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. దాదా తనను బాగా ప్రోత్సహించారు అని, గంగూలీ కెప్టెన్ గా ఉన్నపుడు యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం ఇచ్చిన విషయం తెలిపారు.