త్వరలో జరగనున్న అబుదాబి టీ10 లీగ్‌లో యువరాజ్‌సింగ్ ఆడబోనున్నాడని టోర్నమెంట్ ఛైర్మన్ షా ఉల్ ముల్క్ తెలిపారు. నవంబర్ 15 నుంచి 24 వరకు జరిగే ఈ టోర్నమెంట్ అబుదాబి లో జరగనుంది. ఈ రానున్న మూడో సీజన్లో ఎనిమిది జట్లు ఆడనున్నట్టు సమాచారం. భారత్ ఆటగాళ్లని ఒక్కరినీ కూడా డ్రాఫ్టింగ్‌లో తీసుకోలేదు. టోర్నమెంట్ ఛైర్మన్ షా ఉల్ ముల్క్ మాట్లాడుతూ భారత్ నుండి రిటైర్ అయిన మాజీ ఆటగాళ్లని తీసుకోబోతున్నారని తేలిపారు. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ఈ టోర్నమెంట్ లో తీసుకునే చర్యల్లో యువీ తో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడిస్తాం అని ముల్క్ అన్నారు.
మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ యువీ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌సింగ్ ఈ మద్యనే వీడ్కోలు చెప్పేశాడు. ఈ టీమిండియా ఆల్‌రౌండర్ కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 లీగ్ లో ఆడిన నేపథ్యం లో అబుదాబి టీ10 లీగ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా చూడాల్సిందే.
ఇంకా వేరే దేశాల నుండి శ్రీలంక ఆటగాళ్లు లసిత్ మలింగా, థిసారా పెరీరా, నిరోషన్ డిక్వెల్లా, ఇంగ్లాండ్ నుండి మోయిన్ అలీ ఇంకా పాక్ నుండి మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఆడ బోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.