Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బలరామకృష్ణమూర్తి మధ్య విభేదాలతో అద్దంకి రాజకీయాలు యావత్ రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి రేపాయి. బయటికి ఏ కారణాలు చెప్తున్నప్పటికీ 2019 ఎన్నికల్లో అద్దంకి టీడీపీ ఎవరికి దక్కుతుంది అన్న అంశమే అన్ని గొడవలకు కారణమని చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారు. కానీ ఒంగోలు పార్టీ సభలో ఇంత గొడవ జరిగినా, టీడీపీ హైకమాండ్ నిప్పులు కురిపించినా ఇప్పటిదాకా గ్రౌండ్ లెవెల్ లో వచ్చిన మార్పు ఏమీ లేదు. టీడీపీ లో విబేధాలు ఈ స్థాయిలో వున్నాయి కాబట్టి ఆ సీట్ లో వైసీపీ గెలవడం సులభం అవుతుందని కొందరి అంచనా. అందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ వైసీపీ శ్రేణులు, నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చిన మాట నిజం. ఇదే ఉత్సాహం కారణం గా ఆ పార్టీలో కూడా ఓ గొడవకు బీజం పడినట్టు తెలుస్తోంది.
అద్దంకి లో గొట్టిపాటి, బలరాం వర్గాలు ఎంత బలంగా ఉన్నాయో గరటయ్య గ్రూప్ కూడా అంతే స్ట్రాంగ్. అయితే ఇది ఒకప్పటి మాట అని కొందరు అంటున్నప్పటికీ అద్దంకిలోని కొన్ని ప్రాంతాల్లో గరటయ్యకు మంచి పట్టుంది. అయితే ఇన్నాళ్లు ఆయన పెద్ద యాక్టివ్ గా లేరు. కానీ వైసీపీ జిల్లా ప్లీనరీ లో హఠాత్తుగా గరటయ్య కుమారుడు చైతన్య హడావిడి బాగా కనిపించింది. దీంతో బాచిన చెంచు గరటయ్య గానీ ఆయన కుమారుడు గానీ అద్దంకి బరిలో నిలవడానికి రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆ మాట బయటికి వచ్చి రాకముందే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం బయటికి వచ్చింది. అదే జగన్ బాబాయ్, ఒంగోలు ఎంపీ వై.వి సుబ్బారెడ్డి కూడా అద్దంకి మీద కన్నేశారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్న సుబ్బారెడ్డి ఎంపీ గా ఉండటం కన్నా ఎమ్మెల్యే గా పోటీ చేయడమే మేలని భావిస్తున్నారట. ఒకటిరెండు రోజుల తేడాతో బయటికి వచ్చిన ఈ వార్తలతో అద్దంకి వైసీపీ లోనూ గ్రూపుల గోల మొదలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు