అమెరికా వస్తువులపై జీరో టారిఫ్‌…

అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందం కోసం భారతదేశం అమెరికా వస్తువులపై సుంకాలను సున్నాకు తగ్గించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ట్రంప్ ఈ విషయాన్ని దోహాలో జరిగిన వ్యాపార సమావేశంలో వెల్లడించారు. ఇది ఇటీవల అమెరికా విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతీకార చర్యలపై ప్రభావం చూపుతుంది.