కొత్త జడ్పీ చైర్మన్లు కొలువుదీరే తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటించింది, మెన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి 32 జడ్పీ పీఠాల్ని టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే, తాజాగా ఎన్నికైన 28 జిల్లాల్లోని జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యులు జూలై 6న బాధ్యతలు చేపట్టి తొలి సమావేశం నిర్వహించనున్నా రు. పదవీకాలం నెల ఆలస్యంగా ముగుస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కోఆప్షన్‌సభ్యులు ఆగస్టు 7న బాధ్యతలను చేపట్టి, తొలి సమావేశం నిర్వహిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.