మళ్లీ బ్రోతల్‌ కేసులో హీరోయిన్‌..!

Actress Swetha Basu Prasad Arrested Again In Sex Racket Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కొత్త బంగారు లోకం చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్వేత బస్సుప్రసాద్‌కు టాలీవుడ్‌లో అదృష్టం కలిసి రాలేదు. తెలుగులో చిన్నా చితక సినిమాలు చేసి ఐటెం సాంగ్‌లలో నటించినా కూడా ఆమెకు బ్రేక్‌ రాలేదు. దాంతో ఆమె తమిళంలో కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. కన్నడంలో ఒకటి రెండు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. ఆ సమయంలోనే శ్వేత బస్సు ప్రసాద్‌ బ్రోతల్‌ కేసులో అరెస్ట్‌ అయ్యింది.

కొన్నాళ్ల పాటు జైల్లో కూడా ఉంది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక దర్శకుడి వద్ద ఆమె రైటర్‌గా చేరింది. మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా చెప్పుకొచ్చింది. ఇంతలోనే మరోసారి ఆమెను సెక్స్‌ రాకెట్‌లో పోలీసులు పట్టుకున్నారు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవకాశాలు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మళ్లీ వ్యభిచారం మొదలు పెట్టినట్లుగా కొందరు భావిస్తున్నారు. రెండు సార్లు బ్రోతల్‌ కేసులో అరెస్ట్‌ అయిన హీరోయిన్‌గా శ్వేత బస్సు ప్రసాద్‌ వార్తల్లో నిలిచింది. ఈ విషయమై ఇటు పోలీసులు కాని, అటు శ్వేత బస్సు ప్రసాద్‌ నుండి కాని క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు