జైలవకుశ 160 కోట్లు కొల్లగొట్టింది…ఇంకా రేసులోనే.

jai-lava-kusa-was-collections-gets-160-crores

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కడక్కడా వినిపించిన డివైడ్ టాక్ , సాదాసీదా సినిమా అంటూ క్రిటిక్స్ సమీక్షలు జైలవకుశ ప్రభంజనాన్ని ఆపలేకపోయసాయి. మొదటి వారం దాటి రెండో వారంలోకి అడుగు పెట్టినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళుతూనే వుంది. ఈ సినిమా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 160 కోట్లు కొల్లగొట్టింది. ఇదేదో ఆషామాషీ లెక్క కాదు. సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ఇదే విషయాన్ని నిర్దారిస్తూ ట్వీట్ చేశారు. అయితే అంతటితో ఈ సినిమా కలెక్షన్స్ ఆగేట్టు లేవు. ఇంకా ఇప్పటికీ జైలవకుశ వసూళ్ళలో స్పైడర్ కి గట్టి పోటీ ఇస్తున్నట్టు సంధు చెప్పారు. జై పాత్రలో నటనకు గాను ఎన్టీఆర్ కి భలే పేరు వచ్చింది. పేరుతో పాటు డబ్బులు రావడం ఏ కొన్ని సినిమాలకే కుదురుతుంది. జైలవకుశతో ఆ ఫీట్ సాధించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ .

ఇక విదేశాల్లోనూ జైలవకుశ కలెక్షన్స్ దుమ్ము లేపాయి. గురువారానికే ఈ సినిమా ఒక్క అమెరికాలోనే 14 లక్షల 67 వేల 800 డాలర్స్ వసూలు చేసింది. అంటే మన రూపాయల్లో 9 కోట్ల 59 లక్షల రూపాయలు. ఏ విధంగా చూసినా అన్న కళ్యాణ్ రామ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం మీద చేసిన జైలవకుశ యంగ్ టైగర్ కి ఎన్నో తీపి గురుతులు మిగిల్చింది.