జైలవకుశ ఆడియో, రిలీజ్ డేట్స్ వచ్చేసాయి.

NTR jai Lava Kusa Movie release date and audio details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రల్లోమెప్పించబోతున్న జైలవకుశ కి సంబంధించిన కీలక డేట్స్ బయటికి వచ్చేసాయి. ప్రస్తుతం నిర్మాణంలో వున్న ఈ సినిమాని సెప్టెంబర్ 27 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక ఆడియో విషయంలోనూ ఓ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఆగష్టు 12 న ఆడియో విడుదల కార్యక్రమాన్ని గ్రాండ్ గా చేయడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలు అయ్యాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణే లోని ఓ భారీ భవంతిలో సాగుతోంది. జై పాత్రకి సంబంధించిన కీలక సన్నివేశాలు అందులో చిత్రీకరిస్తున్నారు. గతంలో ఇదే భవంతిలో బాలీవుడ్ సినిమా రామ్ లీల కూడా తీశారు. ఈ షెడ్యూల్ పూర్తి అయితే సినిమాకి సంబంధించి మేజర్ షూటింగ్ పార్ట్ అయిపోయినట్టే అని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు

బాబాయ్, అబ్బాయి లాభాలు చూస్తున్నారు.

ఫిదా’ అయ్యి వరాలు ప్రకటించిన కేసీఆర్‌

కన్ఫర్మ్‌ : నవదీప్‌ డ్రగ్స్‌ తీసుకున్నాడు..