రంగస్థలం గురించి ఆసక్తికర విషయం

Ram Charan New Movie Rangasthalam 1985 Latest Updates

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Ram Charan New Movie Rangasthalam 1985

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రంగస్థలం 1985’. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ చెవిటి పల్లెటూరు వాడిగా నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఇప్పటి వరకు సినిమాలో కొద్ది సమయం మాత్రమే చరణ్‌ అలా పల్లెటూరులో కనిపిస్తాడు అని, సినిమాలో ఎక్కువ సమయం చరణ్‌ సాదారణంగానే కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఆరంభం నుండి చివరి వరకు కూడా చరణ్‌ పల్లెటూరు కుర్రాడిగానే కనిపించున్నాడు.

ఇక సినిమాలో చరణ్‌ పాత్ర విభిన్నంగా ఉంటుందని, ఇప్పటి వరకు తెలుగులో ఏ స్టార్‌ హీరో కూడా చేయలేదని అంటున్నారు. ఇలాంటి కథాంశంతో ఒక స్టార్‌ హీరో సినిమా చేయడం చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. కేవలం  తమిళంలోనే ఇలాంటి ప్రాజెక్ట్‌లు వస్తాయని,  ఏ తెలుగు హీరో కూడా ఇలా నటించేందుకు సాహసం చేయరు అంటున్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌లో తెలుగు ప్రేక్షకుల ఊహకు అందని ఒక షాక్‌ కూడా ఉంటుందని అంటున్నారు. తెలుగులో అలాంటి క్లైమాక్స్‌ను ప్రేక్షకులు ఒప్పుకోరు. అయినా కూడా సుకుమార్‌ సాహసం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఆ క్లైమాక్స్‌తో సినిమాకు ప్రాణం వస్తుందని, అదొక ప్రయోగం అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ ప్రయోగం తెలుగులో చాలా అరుదుగా సక్సెస్‌ అవుతుంటాయి. మరి సుకుమార్‌ చేయబోతున్న ‘రంగస్థలం’ ప్రయోగం సక్సెస్‌ అయ్యేనా చూడాలి?

మరిన్ని వార్తలు:

‘డీజే’లో బన్నీ మరో యాంగిల్‌

మస్త్‌ మల్టీస్టారర్‌.. ఫుల్‌ ఎంటర్‌టైనర్‌