రోజా ఓ వైసీపీ బూమరాంగ్

Roja Finds Fault With Bhuma Akhila Priya Dressing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రోజాను కంట్రోల్ చేయకపోతే మీరు అధికారంలోకి రావడం కష్టం. ఇదెవరూ శత్రువులు చెప్పిన మాట కాదు.. సాక్షాత్తూ పీకే జగన్ తో అన్న మాటలు. అప్పట్లో కొన్నాళ్లు రోజాను సైడ్ చేసిన జగన్.. మళ్లీ నంద్యాలలో ఆమెతో ఘాటైన విమర్శలు చేయిస్తున్నారు. ఈ దెబ్బతో టీడీపీ పండగ చేసుకుంటోంది. తండ్రి పోయి దుఃఖంలో ఉన్న అఖిలప్రియపై రోజా చేస్తున్న దారుణమైన విమర్శలు.. స్థానికుల్లో చర్చకు తెరలేపాయి.

ఉపఎన్నికల్లో పోటీ చాలా గట్టిగా ఉంది. ఎవరు గెల్చినా చాలా తక్కువ మెజార్టీతోనే గెలుస్తారు. కానీ వైసీపీ మాత్రం స్వీయ తప్పిదాలతో ఓటమి కొనితెచ్చుకునేలా కనిపిస్తోంది. స్వయంగా సీఎంను కాల్చేసినా తప్పు లేదన్న జగన్ మాటలు ఇప్పటికే దుమారం రేపగా.. ఇప్పుడు రోజా కూడా చుడీదార్ వేసుకుంటే మగరాయుడేనని కొత్త స్టేట్ మెంట్ ఇచ్చారు. అసలు రోజా ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ఉన్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

చీర కట్టుకుంటేనే గౌరవనీయ అమ్మాయి అనే ప్రకటనను రోజానే కాదు ఎవరూ సమర్థించుకోలేరు. కానీ రోజా మాత్రం నోటికి ఎంత వస్తే అంతగా చెలరేగిపోతున్నారు. అసలు రోజాను ఎందుకు ఐరన్ లెగ్ అంటారో ఇప్పుడు అర్థమౌతోందంటున్నారు వైసీపీ నేతలు. జగన్ కు ఇప్పటికే ఫిర్యాదులు వెళ్లిపోయాయి. సెంటిమెంట్ తో గెలవాల్సిన ఎన్నికల్లో నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే ఎలా గెలుస్తామని నంద్యాల వైసీపీ నేతలు తలపట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

నంద్యాల నామినేషన్లకు లైన్ క్లియర్